స్టేడియంలో ప్రేక్షకులు లేకుండా మ్యాచ్‌లు జరిగితే, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆటపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డాడు ఆ దేశ మాజీ బౌలర్ డారెన్ గాఫ్. కరోనా వల్ల ఖాళీ స్టేడియాల్లో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించాలని వ్యాఖ్యలు వస్తున్న తరుణంలో ఇలా మాట్లాడాడు. స్టోక్స్‌తో పాటు దూకుడైన ఆటగాళ్ల ప్రదర్శనపై ఈ ఎఫెక్ట్ ఉంటుందని తెలిపాడు.
"బెన్ స్టోక్స్ ఆటను ఇప్పటికే చాలా మ్యాచ్‌ల్లో చూశాం. జట్టు కష్టకాలంలో ఉన్నప్పుడు తన పూర్తి సహకారాన్ని అందించాడు. అయితే ప్రేక్షకులు లేని స్టేడియంలో అతడి ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి. నాకు తెలిసి ఈ విషయం స్టోక్స్‌పై కొంత ప్రభావం చూపుతుందని అనుకుంటున్నా"
- డారెన్ గాఫ్, ఇంగ్లాండ్ మాజీ బౌలర్