భారత సీనియర్ ఆటగాడు మురళీ విజయ్ విజ్ఞప్తిపై ఆసీస్ మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ స్పందించింది. డిన్నర్‌కు వెళ్లేందుకు సిద్ధమని చెప్పింది. బిల్ మాత్రం అతడే కట్టాలని తెలిపింది. సోనీస్పోర్ట్స్ నిర్వహించిన లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.
విజయ్‌తో డిన్నర్‌కు ఆసీస్ మహిళా క్రికెటర్ - క్రికెటర్ మురళీ విజయ్ వార్తలు
టీమిండియా బ్యాట్స్‌మన్ మురళీ విజయ్‌తో డిన్నర్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది ఆసీస్ మహిళా క్రికెటర్ ఎల్లీస్ పెర్రీ.
కొన్నిరోజుల క్రితం చెన్నై సూపర్‌కింగ్స్ నిర్వహించిన లైవ్‌చాట్‌లో పాల్గొన్నాడు క్రికెటర్ మురళీ విజయ్. డిన్నర్‌కు ఏ ఇద్దరు క్రికెటర్లతో వెళ్లాలనుకుంటారు? అనే ప్రశ్నకు సమాధానంగా ఎల్లీస్ పెర్రీ, శిఖర్ ధావన్‌ల పేర్లు చెప్పాడు. ఆమె అందంగా ఉంటుందని, కుదిరితే డిన్నర్ చేయాలనుందని విజయ్ అన్నాడు. తాజాగా దీనిపై స్పందించిన మహిళా క్రికెటర్.. తాను అందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపింది.
భారత్ తరఫున 2018లో చివరగా టెస్టు ఆడిన మురళీ విజయ్.. జట్టులో కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఓపెనర్లుగా స్థిరపడటం వల్ల చోటు దక్కించుకోలేకపోయాడు. ప్రస్తుతం ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.