తెలంగాణ

telangana

ETV Bharat / sports

' దక్షిణాఫ్రికా జట్టుకు సారథ్యం వహించడానికి రెడీ' - డీన్​ ఎల్గర్​ కెప్టెన్సీ

సఫారీ జట్టుకు టెస్టు కెప్టెన్​గా వ్యవహరించడానికి ఆ దేశ క్రికెటర్​ డీన్​ ఎల్గర్​ ఆసక్తి వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డుతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. గతంలో అనేక మ్యాచ్​ల్లో జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం తనకుందని ఎల్గర్​ తెలిపాడు.

Elgar shows interest in becoming South Africa's Test captain
'టెస్టు కెప్టెన్​గా బాధ్యత స్వీకరించడానికి నేను సిద్ధమే!'

By

Published : May 25, 2020, 5:42 PM IST

దక్షిణాఫ్రికా టెస్టు జట్టుకు కెప్టెన్​గా బాధ్యతలు నిర్వర్తించడానికి ఆ దేశ క్రికెటర్​​ డీన్​ ఎల్గర్ ఆసక్తి వ్యక్తం చేశాడు. తనకు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని క్రికెట్​ దక్షిణాఫ్రికాతో జరిగిన తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ పదవికి డుప్లెసిస్ ఫిబ్రవరిలో​ రాజీనామా చేశాడు. క్వింటన్​ డికాక్​ను ఆ స్థానానికి సారథిగా ఎంపిక చేస్తారని అనుకున్నా.. వికెట్​ కీపర్​గా తనకు మరింత ఒత్తిడి కలిగించడం ఇష్టం లేని కారణంగా అతడిని ఎంపిక చేయలేదని క్రికెట్​ దక్షిణాఫ్రికా తెలిపింది. జులైలో వెస్టిండీస్​తో మూడు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ జరగనుంది. ఈ క్రమంలో జట్టుకు కొత్త కెప్టెన్​ను ఎంపిక చేయాలని భావిస్తోంది సఫారీ క్రికెట్​ బోర్డు.

"నా పాఠశాల స్థాయి నుంచి ప్రాంతీయ, ఫ్రాంచైజీ స్థాయి జట్లకు గతంలో నాయకత్వం వహించా. దాన్ని బాగా ఆస్వాదించా. ఒకవేళ నాకు కెప్టెన్​గా బాధ్యతలు అప్పగిస్తే కచ్చితంగా చాలా కాలంపాటు విధేయతతో నిర్వర్తిస్తా".

- ఎల్గర్​, దక్షిణాఫ్రికా ఓపెనర్​

శ్రీలంక వేదికగా 2006లో జరిగిన అండర్​-19 ప్రపంచకప్​న​కు ఎల్గర్ నాయకత్వం వహించాడు. 2017లో ఇంగ్లాండ్​పై టెస్టు సిరీస్ ఆడే క్రమంలో అప్పటి కెప్టెన్​ డుప్లెసిస్​కు మొదటి బిడ్డ పుట్టడం వల్ల ఓ మ్యాచ్​ గైర్హాజరు అయ్యాడు.. దీంతో ఆ మ్యాచ్​లో ఎల్గర్​ సారథిగా బాధ్యతలు చేపట్టాడు.

గతేడాది పాకిస్థాన్​పై జరిగిన టెస్టు సిరీస్​లో స్లో ఓవర్​ రేట్​ కారణంగా కెప్టెన్​ డుప్లెసిస్​ను రెండు మ్యాచ్​లకు సస్పెండ్​ చేయడం వల్ల అనుహ్యంగా రెండోసారి నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు ఎల్గర్. ఇప్పటికే దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్​గా ఉండటానికి మర్కరమ్​, కేశవ్​ మహరాజ్​ ఆసక్తి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి...'ఆయన చరిత్ర అందరికీ ఆదర్శం'

ABOUT THE AUTHOR

...view details