సాధారణంగా అభినందనలు చెప్పాలనుకున్నప్పుడు లేదా ఇంకేదైనా సందర్భంలో కరచాలనం చేస్తూ ఉంటారు. ప్రతి దేశంలోనూ ఇదే ఎక్కువగా చూస్తుంటాం. అయితే కరోనా ప్రభావంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు కరచాలనాలను వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. షేక్‌హ్యాండ్ లాగా షేక్ లెగ్ అని, ఒకరి మోచేతిని మరొకరు తాకడం, ఇలా ఎన్నెన్నో చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ లీగ్ క్లబ్లో చోటుచేసుకుంది.
ఈ మ్యాచ్‌లో వికెట్ పడిన తర్వాత సదరు క్రికెటర్లు షేక్ హ్యాండ్‌కు బదులు ఒకరి మోచేతిని, మరొకరు తాకుతూ అభినందనలు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.