క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఓ ఆటగాడు కరోనా బారిన పడితే, అతడికి ప్రత్యామ్నాయం ఉండాలనే విషయంపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)తో చర్చలు జరుపుతోంది. అనుకున్నట్లు జరిగితే త్వరలో వెస్టిండీస్‌తో జరగబోయే టెస్టు సిరీస్‌తో దీనిని అమలు చేయనున్నారు.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఎవరైనా గాయంతో, మరే ఇతర ఆరోగ్య సమస్యలతో మైదానాన్ని వీడితే మరొక ఆటగాడిని ప్రత్యామ్నాయంగా జట్టులోకి తీసుకోవచ్చు. కానీ, అతడికి బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసే అవకాశం ఉండదు. ఇప్పుడు కొవిడ్-19కు ప్రత్యామ్నాయంపై దృష్టిపెట్టింది ఈసీబీ.