తెలంగాణ

telangana

ETV Bharat / sports

రూ 50తో తొలి డే/నైట్​ టెస్టు మ్యాచ్​ చూడొచ్చు.. - edne gardens test

భారత్​లో తొలిసారి జరిగే డే/నైట్​ టెస్టుకు సంబంధించిన టికెట్ ధరలు, సమయాల వివరాలు వెల్లడించారు కాబ్ కార్యదర్శి అవిషేక్ దాల్మియా.

డే/నైట్​ టెస్టు చూసేయచ్చు ఇక రూ.50కే

By

Published : Oct 30, 2019, 5:11 AM IST

బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా తొలి డే/నైట్​ టెస్టు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్​లో వచ్చే నెల 22-26 వరకు జరిగే ఈ మ్యాచ్​లో భారత్​-బంగ్లాదేశ్​ తలపడనున్నాయి. దీనికి సంబంధించిన టిక్​ట్ ధరలు, సమయం వివరాలను బంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్​)​ కార్యదర్శి అవిషేక్ దాల్మియా ప్రకటించారు. టికెట్ కనీస ధర రూ.50గా ఉంటుందని చెప్పారు.

"మ్యాచ్​ మధ్యాహ్నం 1:30కి మొదలై రాత్రి 8:30కి ముగుస్తుంది. వీక్షకులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంటికి చేరుకోవచ్చు. బీసీసీఐ నుంచి ధ్రువీకరణ వస్తే టికెట్​లు ముద్రణకు పంపిస్తాం. అదే విధంగా పాఠశాల విద్యార్థులను ఈ టెస్టుకు వచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. టికెట్​ ధరలు రూ.50, 100, 150లుగా ఉంటాయి. వీలైనంత మందిని మ్యాచ్​ చూసేలా చేయడమే మా లక్ష్యం" -అవిషేక్ దాల్మియా, బంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి

సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఈ డే/నైట్​ టెస్టుకు తొలి విరామం.. టీ(20 నిమిషాలు), ఆ తర్వాత సప్పర్ బ్రేక్(40 నిమిషాలు) ఉంటుంది. అంటే మూడో సెషన్స్​లో అర్ధభాగం ఫ్లడ్​లైట్ల వెలుగులో జరగనుంది.

ఈడెన్ గార్డెన్స్ మైదానం

ఇది చదవండి: గులాబీ బంతితోనే భారత్-బంగ్లాదేశ్​​ రెండో టెస్టు

ABOUT THE AUTHOR

...view details