వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మాజీ అధ్యక్షుడు డేవ్ కేమరూన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్ డ్వేన్ బ్రావో. తన కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోవడానికి కారణం అతడేనని, చాలా మంది కెరీర్లను నాశనం చేశాడని మండిపడ్డాడు. కేమరూన్ పదవి కాలం ముగియడం శుభ పరిణామమని సంతోషం వ్యక్తం చేశాడు.
"కొంత మంది ప్రతీకార చర్యల వల్లే వెస్టిండీస్ క్రికెట్ కష్టాల్లో పడింది. అలాంటి వారి వల్ల చాలా మంది ఆటకు గుడ్‌బై చెప్పారు. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఉన్నాడు. నియంత పాలన అంతమైంది. పీడ విరగడైంది. కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న రికీ స్కిరిట్ట్తోనైనా విండీస్ క్రికెట్ మారుతుందని ఆశిస్తున్నా" - డ్వేన్ బ్రేవో, విండీస్ మాజీ క్రికెటర్.