వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో.. ధోనీపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీపై ఓ పాటను రూపొందించాడు. ఈ వీడియోను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం తమ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ వీడియోలో ధోనీని బ్రావో.. "బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్" అనే మాటలను హాస్యాస్పదంగా పలికాడు. భారత్‌లో మహీ, రాంచీలో ధోనీ, చెన్నైలో తలా అని అభిమానులు స్టేడియాల్లో ధోనీని స్మరిస్తారని ఈ పాటలో తెలియజేశాడు. ధోనీ ప్రపంచాన్ని జయిస్తాడని అందులో వెల్లడించాడు.