భారత మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్ కౌర్ శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంది. 30వ జన్మదినం సందర్భంగా ఆటగాళ్లు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
హర్మన్ ప్రీత్ 93 వన్డేలు, 96 టీ20లు ఆడింది. 2017 ప్రపంచకప్‌లో ప్రదర్శనకు గానూ అర్జున అవార్డు గెలుచుకుంది.
2017 ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఆసీస్‌పై 171 పరుగుల స్కోరును సాధించిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
మహిళలు సాధించలేనివంటూ ఏవీ లేవూ.. ఆ విషయాన్ని హర్మన్ రుజువు చేసింది అంటూ భారత క్రికెటర్ రహానే ట్వీట్ చేశాడు.