దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తిరిగి జట్టులోకి రప్పించాలని ఆ దేశ సీనియర్లు భావిస్తున్నారు. ఇటీవల కోచ్‌గా నియమితుడైన మార్క్ బౌచర్.. ఏబీని రప్పిస్తానని చెప్పగా.. తాజాగా సఫారీల సారథి ఫాఫ్ డుప్లెసిస్ ఇదే విధంగా స్పందించాడు. 2020 టీ20 ప్రపంచకప్‌లో డివిలయర్స్ పునరాగమనం చేస్తే చూడాలనుందని చెప్పాడు.
"రెండు మూడు నెలల క్రితమే ఈ అంశంపై(డివిలియర్స్ పునరాగమనం) చర్చలు జరిగాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌పైనే దృష్టిసారించాం. అయితే టీ20 ఫార్మాట్ విభిన్నంగా ఉంటుంది." - ఫాఫ్ డుప్లెసిస్, దక్షిణాఫ్రికా కెప్టెన్