దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ డుప్లెసిస్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టీ20, టెస్టు బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగినట్టు చెప్పాడు. నెల రోజుల ముందు వన్డే సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు.
"జట్టును ముందుకు నడిపించడానికి కొత్త మార్గదర్శకుడు అవసరం. కెప్టెన్సీ నుంచి వైదొలగినా జట్టుకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా. కొత్త నాయకత్వంలో దక్షిణాఫ్రికా జట్టు మరింత ముందుకెళుతుంది."