తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్​ పర్యటనకు వచ్చే సఫారీ జట్టిదే - SAVSIND

సెప్టెంబర్​లో భారత పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టును ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. టెస్టులకు డుప్లెసిస్ సారథ్యం వహించనుండగా, టీ20లకు డికాక్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు.

దక్షిణాఫ్రికా

By

Published : Aug 13, 2019, 9:50 PM IST

Updated : Sep 26, 2019, 10:10 PM IST

సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ సిరీస్​ కోసం టెస్టు, టీ20 జట్లను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది. టీమిండియాతో జరగనున్న 3 టెస్టుల కోసం ముగ్గురు కొత్త ఆటగాళ్లకు చోటు కల్పించింది సఫారీ సెలక్షన్ కమిటీ.

పేసర్ ఎన్రిచ్ నొర్ట్‌జే, స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ సెనురన్ ముత్తుసామి, వికెట్ కీపర్/బ్యాట్స్‌మన్ రూడీ సెకండ్స్‌‌లు టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నారు. టెస్టు జట్టు కెప్టెన్​గా డుప్లెసిస్ వ్యవహరించనుండగా.. వైస్ కెప్టెన్‌గా బవుమాను బోర్డు ఎంపిక చేసింది.

టీ20ల నుంచి డుప్లెసిస్​కు విశ్రాంతినిచ్చింది సెలక్షన్ కమిటీ. జట్టు వికెట్ కీపర్ డికాక్​ను కెప్టెన్​గా ఎంపిక చేశారు. ప్రపంచకప్​లో సత్తాచాటిన వాన్​డర్ డసెన్ వైస్​కెప్టెన్​ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. బవుమా, జోర్న్ ఫోర్టుయిన్‌లతో పాటు అన్రిచ్ నొర్ట్‌జేలు టీ20ల్లో అరంగేట్రం చేయనున్నారు.

మర్​క్రమ్, తెయునిస్ డి బ్రూన్, లుంగి ఎంగిడిలను టీ20 సిరీస్‌కు సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు ఇండియా-ఏతో నాలుగు రోజులు వార్మప్ మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్​లో వీరు ఆడతారు. భారత పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబరు 23 వరకు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్​లు ఆడనుంది.

టెస్టు జట్టు:

ఫాఫ్ డుప్లెసిస్ (సారథి), టెంబా బవుమా (ఉప సారథి), థియునిస్ డి బ్రూయిన్, క్వింటన్ డికాక్ (కీపర్), డీన్ ఎల్గర్, జుబైర్ హమ్జా, కేశవ్ మహరాజ్, అయిదెన్ మర్క్​రమ్, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, ఎన్రిచ్ నార్ట్జే, ఫిలాండర్, డేన్ పీట్, కగిసో రబాడా, రూడీ సెకండ్.

టీ20 జట్టు:

క్వింటన్ డికాక్ (సారథి), వాన్​డర్ డసెన్ (ఉపసారథి), టెంబా బవుమా, జూనియర్ డాలా, జోర్న్ ఫోర్టుయిన్, బ్యూరాన్ హెన్డ్రిక్స్, రీజా హెన్డ్రిక్స్, డేవిడ్ మిల్లర్, ఎన్రిచ్ నార్ట్జే, ఫెహ్లుక్వాయో, ప్రిటోరియస్, కగిసో రబాడా, తబ్రేజ్ షంశీ, జోన్-జోన్ స్మట్స్.

ఇవీ చూడండి.. 'ఓవర్​ త్రో నియమంపై చర్చ సాధ్యమే'

Last Updated : Sep 26, 2019, 10:10 PM IST

ABOUT THE AUTHOR

...view details