యువ ఆటగాళ్లను అత్యుత్తమ క్రికెటర్లను తయారు చేసే భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్.. తన బ్యాటింగ్ మెరుగుపడటంలోనూ సహాయపడ్డాడని చెప్పాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్. ముఖ్యంగా స్పిన్ ఎదుర్కోవడంలో అతడు చెప్పిన పాఠాలు బాగా పనికొచ్చాయని తెలిపాడు. ఐపీఎల్లో వల్ల తన ఆటతీరు మెరుగైందని.. ద్రవిడ్, సెహ్వాగ్ లాంటి ప్రపంచస్థాయి ఆటగాళ్లతో ఆడటం గొప్ప అనుభూతి అని అన్నాడు.
"స్పిన్ ఎదుర్కోవడం గురించి ద్రవిడ్ పాఠాలు చెప్పారు. బంతి డెలివరీ అయ్యాక లెంగ్త్ చూసుకొని ఆడాలని పలు సూచనలు ఇచ్చారు. అవి నా ఆటతీరును పూర్తిగా మార్చేశాయి" అని పీటర్సన్ తెలిపాడు.