టీమిండియా మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ప్రధాన కోచ్ బాధ్యతలు ఇంకా స్వీకరించలేదు. బీసీసీఐ విధించిన ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఆ పదవిలో చేరనీయకుండా ద్రవిడ్‌కు అడ్డుతగులుతోంది. ప్రస్తుతం ఇండియా సిమెంట్స్‌లో ఉద్యోగిగా ఉన్న రాహుల్ ద్రవిడ్... జులై 1న జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. కానీ.. బీసీసీఐ నూతన నిబంధనల ప్రకారం క్రికెట్‌కు సంబంధించిన ఏ వ్యక్తీ ఒకేసారి రెండు పదవుల్లో ఉండరాదు. అందుకే మిస్టర్ వాల్ ఏదో ఒక పదవికి రాజీనామా చేయాల్సి ఉంది.
" ద్రవిడ్ ఇంకా జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించలేదు. అతడు ఆ పదవిలో చేరాలంటే ఇండియా సిమెంట్స్‌కు రాజీనామా చేయాలి ".
- బీసీసీఐ ఉన్నతాధికారి