ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో రాణించిన యువ ఆటగాళ్ల ప్రదర్శనపై.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ స్పందించాడు. జట్టుపై, ఇండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ప్రభావముందని తెలిపాడు. రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, మహమ్మద్ సిరాజ్‌లు మెరుగైన ప్రదర్శన చేయడంలో అతని పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించాడు. ది వాల్ ను పొగుడ్తూ మాట్లాడిన వీడియోను ఇంజమామ్.. తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు.
అండర్-19 నుంచి భారత్-ఏ కు, అక్కడి నుంచి జాతీయ జట్టులోకి ఆ యువ ఆటగాళ్ల ప్రస్థానం సాగింది. వారు క్రికెట్లో రాణించడానికి రాహుల్ ద్రావిడే కారణమని తెలుసుకున్నాను. అతని బలమేంటనేది అతడి 'ది వాల్' పేరే చెబుతుంది. ఏ పరిస్థితిలోనైనా ఆడగల సత్తా అతని సొంతం. మానసికంగా దృఢమైన వ్యక్తి. తనని తాను సర్దుబాటు చేసుకోగలడు. ఈ యువ ప్లేయర్లనూ.. రాహుల్ తనలాగే మానసికంగా దృఢంగా తయారు చేశాడు.
-ఇంజమాముల్ హక్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్.