టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా, మరో ఇద్దరు క్రికెటర్ల డోపింగ్ కేసుల ప్రక్రియకు.. ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) క్లీన్ చిట్ ఇచ్చిందని సమాచారం. ఆటగాళ్లపై విధించిన 6 నుంచి 8 నెలల నిషేధ నిర్ణయం సరిగానే ఉందని తెలిపింది.
అసలేం జరిగింది..

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సమయంలో దగ్గుతో బాధపడుతున్న పృథ్వీ షా బోర్డుకు చెప్పకుండా ఔషధాన్ని వాడాడు. అందులో నిషేధిత ఉత్ప్రేరకం ఉంది. ముందుగానే బోర్డుకు చెబితే శిక్ష ఉండేది కాదు.
క్రికెటర్ల నమూనాలు తీసుకున్న తేదీలు, ఫలితాలు వెల్లడించిన తేదీ, విధించిన శిక్ష విషయంలో బోర్డుపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వాడా.. బోర్డు నిర్ణయం, ప్రక్రియను సమీక్షిస్తామని తెలిపింది. బోర్డు ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని, క్రీడా మధ్యవర్తిత్వ కోర్టుకు వెళ్లాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.