తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్​ఇండియా తిరిగి పుంజుకోవడం కష్టమే' - ఆస్ట్రేలియా వర్సెస్​ ఇండియా వార్తలు

తొలిటెస్టులో ఘోర పరాజయం తర్వాత సిరీస్​లో టీమ్ఇండియా తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​ బ్రాడ్​ హాడిన్​. షమీ లేకపోవడం వల్ల భారత బౌలింగ్​లో సరైన వనరులు లేవని తెలిపాడు.

Don't think India can turn this as Adelaide was their only opportunity: Haddin
టీమ్​ఇండియా తిరిగి పుంజుకోవడం కష్టమే!

By

Published : Dec 22, 2020, 7:53 AM IST

అడిలైడ్​ టెస్టులో టీమ్​ఇండియా​ గెలవడానికి మంచి అవకాశమని.. కానీ ఆ జట్టు ఓడిపోయిందని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా మాజీ వికెట్​కీపర్ బ్రాడ్​ హాడిన్​. తొలిటెస్టులో పరాజయం తర్వాత భారత జట్టు సిరీస్​లో తిరిగి పుంజుకోవడం చాలా కష్టమని ఆయన అన్నాడు.

"ఈ పరాజయం నుంచి భారత్‌ కోలుకోగలదని నేను అనుకోను. సిరీస్‌లో భారత్‌కు మ్యాచ్‌ గెలవడానికి ఉన్న ఏకైక అవకాశం అడిలైడ్‌లో తొలి టెస్టు. అక్కడికి పరిస్థితులు భారత బౌలర్లకు సహకరించాయి. పరుగులు కూడా బాగానే చేశారని అనుకున్నా. సిరీస్‌లో భారత్‌ ఇక పుంజుకుంటుందని అనుకోను."

- బ్రాడ్​ హాడిన్​, ఆస్ట్రేలియా మాజీ వికెట్​కీపర్​

రాబోయే మూడు మ్యాచ్​ల్లో భారత్​ రెండు టెస్టులు గెలిచే అవకాశం ఉందని హాడిన్​ అన్నాడు. "మిగిలిన మూడు టెస్టుల్లో ఒకటి బ్రిస్బేన్‌లో జరగాల్సివుంది. అక్కడ ఎవరూ ఆసీస్‌ను ఓడించలేరు. వచ్చే రెండు టెస్టుల్లో పిచ్‌ భారత క్రికెట్‌కు సరిపోతుంది. కానీ ఆ జట్టు పుంజుకోవడం కష్టం. కిందటిసారి ఇక్కడికి వచ్చినప్పుడు భారత్‌కు గొప్ప బౌలింగ్‌ దళం ఉంది. ఇప్పుడు షమీ గాయంతో దూరమయ్యాడు. అతడి స్థానాన్ని భర్తీ చేసే బౌలింగ్‌ వనరులు భారత్‌కు లేవు" అని హాడిన్‌ అన్నాడు.

ఇదీ చూడండి:హైదరాబాద్​ క్రికెట్​ బాగుపడేదెన్నడో?

ABOUT THE AUTHOR

...view details