బోర్డర్-గావస్కర్ టోర్నీలో మూడు టెస్టులకు సారథ్యం వహించనున్న అజింక్య రహానేకు వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌సింగ్ పలు సూచనలు చేశాడు. కోహ్లీతో పోలిస్తే అతడి నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వం భిన్నంగా ఉంటాయని తెలిపాడు. నాయకత్వం కోసం తన ఆటతీరు, వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దని సలహా ఇచ్చాడు.
"అజింక్య రహానేకు సారథ్యం కచ్చితంగా సవాలే. ఎందుకంటే అతడు గతంలో పూర్తిస్థాయి సిరీస్‌కు నాయకత్వం వహించలేదు. అయితే అతడు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటాడు. ఎక్కువగా భావోద్వేగాలు పలికించడు. కోహ్లీతో పోలిస్తే ఎంతో భిన్నం. అందుకే అతడికిది కొత్త అనుభవం, కొత్త ఇన్నింగ్స్ అనే చెప్పాలి. అతడు ఎక్కువ పరుగులు చేసి జట్టుకు విజయాల్ని అందించాలని కోరుకుంటున్నా"