కరోనా కారణంగా క్రికెట్ టోర్నీలన్నీ వాయిదా పడ్డాయి. భారత్లో మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలో ఈ ఏడాది ఇక్కడ సిరీస్లు నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. దీంతో పలు సిరీస్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. ఐపీఎల్ యూఏఈకి తరలివెళ్లింది. తాజాగా టీమ్ఇండియా భవిష్యత్ ప్రణాళికలపై స్పందించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. రాష్ట్ర సంఘాలకు రాసిన లేఖలో స్పష్టతనిచ్చాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్తో సిరీస్లో తలపడతారని వెల్లడించాడు.
"కోహ్లీసేన ఈ ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళుతుంది. ఆ సిరీస్ ముగిసిన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చి ఇంగ్లాండ్తో సిరీస్లో తలపడుతుంది. ఈ సిరీస్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుంది. దీని తర్వాత ఏప్రిల్లో ఐపీఎల్ నిర్వహిస్తాం."
-బీసీసీఐ లేఖలో గంగూలీ