దేశంలో ప్రస్తుతం కరోనా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో సురక్షిత ప్రయాణాలు సాగుతున్నప్పుడే దేశవాళీ క్రికెట్ జరుగుతుందని స్పష్టం చేశారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ. ఎందుకంటే దేశంలో ఈ మ్యాచ్ల కోసం యువఆటగాళ్లు అధిక ప్రయాణాలు చేయాల్సి వస్తుందని.. ఈ క్రమంలో వారు వైరస్ బారిన పడే అవకాశం ఉందన్నాడు. వారి భద్రతే తమ తొలి ప్రాధాన్యమని వెల్లడించారు.
"దేశవాళీ టోర్నీలు కరోనా తగ్గుముఖం పట్టాకే జరుగుతాయి. ముఖ్యంగా జూనియర్ క్రికెట్లో జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుత పరిస్థితులు అస్సలు బాగోలేవు. ఈ మ్యాచ్ల కోసం యువఆటగాళ్లు అధికంగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో వైరస్ ప్రభావానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వారిని కాపాడటం మా బాధ్యత."