తన మనవడి ప్రతిభ మీద ఆ తాతకు ఎంతో నమ్మకం! అతను ఎప్పటికైనా అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడంటూ పందెం కాశాడు. ఆ తర్వాత ఆ పెద్దాయన చనిపోయాడు. అయితే తాత లేకపోయినా ఆయన నమ్మకాన్ని నిలబెడుతూ మనవడు ఇంగ్లాండ్ తరఫున టెస్టు మ్యాచ్ ఆడాడు. తన నాలుగో టెస్టులోనే చక్కటి సెంచరీ కూడా సాధించి తాతను గెలిపించాడు. ఇదీ ఇంగ్లాండ్ యువ బ్యాట్స్‌మన్ డామ్ సిబ్లీ ఆసక్తికర కథ!
చనిపోయిన తాతను గెలిపించిన మనవడు! - Dom Sibley grandfather
ఇంగ్లాండ్ ఓపెనర్ డామ్ సిబ్లీ చనిపోయిన తన తాతను గెలిపించాడు. తన మనవడు ఇంగ్లీష్ జట్టులో ఆడతాడంటూ 2011లో బెట్టింగ్ వెబ్‌సైట్లో పందేలు కాశాడు సిబ్లీ తాత కెనెత్ మెకంజీ. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో శతకం బాది తాత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేశాడు సిబ్లీ.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో 24 ఏళ్ల ఈ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్.. 133 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతడి తాత కెనెత్ మెకంజీ.. 2011లో చనిపోవడానికి ముందు తన మనవడు ఎప్పటికైనా దేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడంటూ ఓ బెట్టింగ్ వెబ్‌సైట్లో రెండు పందేలు కాశాడు. అప్పటికి సిబ్లీ చిన్న కుర్రాడు. గత కొన్నేళ్లలో దేశవాళీల్లో రాణించి ఇటీవలే ఇంగ్లాండ్ జట్టులోకి వచ్చాడు. మెకంజీ గెలిచిన పందెం ద్వారా సిబ్లీ కుటుంబానికి రూ.20 లక్షలకు పైగానే డబ్బులందాయి.
ఇదీ చదవండి: 2020లో రోహిత్ ఈ 3 రికార్డులు బ్రేక్ చేస్తాడా?