భారత్‌లో ఐపీఎల్‌ను విపరీతంగా అభిమానిస్తారు. స్టేడియంలో మ్యాచ్‌లు చూసే అభిమానులు డగౌట్ గురించి వినే ఉంటారు. కానీ ఈ సీజన్లో బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మాత్రం 'డాగ్ అవుట్' చూడనున్నారు. అభిమానులు తమ పెంపుడు జంతువులతో పాటు ఇక్కడ కూర్చొని మ్యాచ్‌ను వీక్షించొచ్చు.
బెంగళూరు జట్టు అధికారిక వెబ్సైట్లో... అభిమానులు తమ పెంపుడు జంతువుతో దిగిన స్వీయ చిత్రాన్ని పోస్టు చేయాలి. అలా పెట్టిన వారిలో 30 మందిని ఎంపిక చేస్తారు. వారికి మ్యాచ్ చూసే అవకాశం కల్పిస్తారు. పిల్లి, శునకాలను మాత్రమే ఈ 'డాగ్ అవుట్'లోకి అనుమతిస్తారు.