ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య యాషెస్ రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ సిరీస్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ స్మిత్ సత్తాచాటుతున్నాడు. తన డిఫెన్స్ స్కిల్స్‌తో ఇంగ్లీష్ బౌలర్ల సహనానికి పరీక్ష పెడుతున్నాడు. దీనిపై నెట్టంట ట్రోల్స్ సందడి చేస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ టామీ బీమౌంట్ స్మిత్ బ్యాటింగ్ శైలిని అనుకరిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
టామీ బీమౌంట్.. ఇంగ్లాండ్ మహిళా వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్. తన ఆటతో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గానూ ఎంపికైంది.