ఐపీఎల్‌కు ప్రాధాన్యమిచ్చే ఇంగ్లాండ్ ఆటగాళ్ల జీతాల నుంచి కోత విధించాలని.. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డును కోరాడు మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్‌కాట్. ఈ లీగ్‌లో ఆడే అన్ని దేశాల క్రికెటర్ల నుంచి ఆయా క్రికెట్ బోర్డులు 10 శాతం కోత విధించాలని సూచించాడు.
''ఇంగ్లాండ్ తరఫున జాతీయ జట్టులో ఆడుతున్న ఆటగాళ్లకు మంచి పారితోషికం లభిస్తుంది. దేశానికి ఆడటానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఐపీఎల్ ద్వారా డబ్బులు సంపాదించడానికి నేను అడ్డుపడను. కానీ, జాతీయ జట్టుకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలి.''
-జెఫ్రీ బాయ్‌కాట్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్.
రొటేషన్ పాలసీ.. తెలివి తక్కువ పని..
ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న ఆటగాళ్ల రొటేషన్ పాలసీపై స్పందించాడు జెఫ్రీ. "అదొక అర్ధరహితమైన, తెలివిలేని విధానమని విమర్శించాడు. ఆటగాళ్లకు ఏదైనా మానసిక సమస్యలుంటే, బయో బబుల్ వాతావరణాన్ని వారు ఎదుర్కోలేకపోతుంటే.. వాళ్లను స్వదేశానికి పంపొచ్చు. అంతేకాని.. రొటేషన్ పాలసీ సరైన విధానం కాదు. దీన్ని తక్షణమే నిలిపివేయాలి." అని బాయ్‌కాట్ పేర్కొన్నాడు.
"కారణం లేకుండా స్వదేశానికి వెళ్తానని ఏ ఒక్క క్రికెటర్ కోరినా.. అతడి జీతంలో కోత విధించండి. లేకపోతే ముందుగానే అతడితో సిరీస్ మొత్తానికి ఆడే విధంగా ఒప్పందం చేసుకోండని" బోర్డుకు సూచించాడు జెఫ్రీ. ఐపీఎల్ ఆడే ఏ ఆటగాడైనా ఈ విధమైన కారణాలతో ఐపీఎల్‌కు దూరమవుతున్నారా? అని బాయ్‌కాట్ ప్రశ్నించాడు.
సీనియర్ క్రికెటర్ జెఫ్రీ.. ఐపీఎల్‌పై ఈ తరహా వ్యాఖ్యలు చేయగా, ఇంగ్లాండ్ కోచ్ సిల్వర్‌వుడ్ మాత్రం ఐపీఎల్‌కు తమ ఆటగాళ్లు పూర్తిగా అందుబాటులో ఉంటారని ఇంతకుముందే వెల్లడించాడు. ఈ పొట్టి లీగ్ వల్ల న్యూజిలాండ్‌తో జూన్‌లో జరిగే టెస్టు సిరీస్‌కు పలువురు ఆటగాళ్లు అందుబాటులో ఉండట్లేరు.