తెలంగాణ

telangana

ETV Bharat / sports

లాక్​డౌన్​ సమయంలో క్రికెటర్లు చేసే పనులేంటి!

కరోనా లాక్​డౌన్​ కారణంగా చాలామంది క్రీడాకారులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో వారికి నచ్చిన వ్యాపకాలతో కాలక్షేపం చేస్తున్నారు. వారిలో టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్​ రాహుల్​, రోహిత్​ శర్మ ఉన్నారు.

Do you know what the team of cricketers do during the lockdown?
లాక్​డౌన్​ సమయంలో క్రికెటర్లు చేసే పనులేంటి!

By

Published : Mar 31, 2020, 7:03 PM IST

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ రవీంద్రజడేజా.. గతంలో తాను గుర్రపు స్వారీ చేసిన వీడియోను ట్విట్టర్​లో పంచుకున్నాడు. మరో వీడియోలో "రన్నింగ్​ నా బలం! నా శరీరాన్ని తీర్చిదిద్దుకోవటానికి ఇదే సరైన సమయం" అని ఇటీవలే ట్వీట్​ చేశాడు. కరోనాపై పోరాటానికి మద్దతు పలుకుతూ.. ప్రధానమంత్రి సహాయనిధికి రూ.21 లక్షల రూపాయలను విరాళంగా అందిస్తున్నట్టు జడేజా భార్య రీవబా జడేజా తాజాగా ప్రకటించింది.

భారత జట్టు ఓపెనర్​ కేఎల్​ రాహుల్ తన పెంపుడు కుక్క 'సింబా'తో సమయాన్ని గడుపుతున్నాడు. టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి హెయిర్​కట్​ చేస్తున్న దృశ్యాన్ని తన భార్య అనుష్క శర్మ ఇటీవలే ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది.

టీమ్​ఇండియా వైస్​ కెప్టెన్​ రోహిత్​శర్మ​ ఇంటి పనులు చేసుకుంటూ తన కుమార్తె సమైరాతో గడుపుతున్నాడు. "ఇంటి పనులను చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. నాకు కెవిన్​ పీటర్సన్​ 12 గంటలకు మెసేజ్​ చేస్తే, నేను 1:30కు సమాధానమిచ్చాను. లాక్​డౌన్​ సమయంలో గంటన్నర పాటు ఏం చేస్తున్నావు అని అతడు నన్ను అడిగాడు. ఇల్లు శుభ్రం చేస్తున్నాని చెప్పా" అని తెలిపాడు హిట్​మ్యాన్.

ఇదీ చూడండి.. అలా అయితే ఐపీఎల్ అక్టోబర్​లో ప్రారంభం!

ABOUT THE AUTHOR

...view details