బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) చీఫ్ రాహుల్ ద్రవిడ్.. బెంగళూరులో బుధవారం కలుసుకోనున్నారు. ఒకప్పటి సహచరులైన వీరిద్దరూ, భారత క్రికెట్ భవిష్యత్తు కార్యచరణ గురించి చర్చించబోతున్నారు.
జూలైలో ఎన్సీఏ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన ద్రవిడ్.. ఇప్పటికే భారత క్రికెట్‌కు సంబంధించి ఓ కార్యచరణను రూపొందించాడు. దానిపై గంగూలీ కొన్ని సూచనలు ఇవ్వనున్నాడు.
బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇంతకు ముందే బీసీసీఐ నిర్వహించిన టెక్నికల్ మీటింగ్స్‌లో వీరిద్దరూ కలిసి పాల్గొనేవారు. గంగూలీ 'ప్రిన్స్ ఆఫ్ కోల్‌కతా'(కాబ్ అధ్యక్షుడు) హోదాలో, అండర్-19, టీమిండియా-ఏ కోచ్ హోదాలో ద్రవిడ్.. ఈ సమావేశాలకు వెళ్లేవారు.
గత కొన్నేళ్లుగా ఎన్సీఏ, భారత క్రికెట్ జట్టుకు పునరావస కేంద్రంగా మారింది. ఆటగాళ్లు తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవడం కోసం ఎన్సీఏను ఆశ్రయిస్తున్నారు. అయితే గంగూలీ-ద్రవిడ్ భేటీలో అకాడమీ గురించి చర్చిండం సహా.. అది ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించనున్నారు.
ఇది చదవండి: దాదా గురించి మీకు తెలియని విషయాలు..!