సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 3 వరకు బెల్జియం, స్పెయిన్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడనుంది టీమిండియా హాకీ జట్టు. అందుకోసం ఆదివారం నాడు బెల్జియం బయలుదేరారు ఆటగాళ్లు. ఈ టూర్ భారత్‌కు చాలా ముఖ్యమైందని తెలిపాడు ప్రధాన కోచ్ గ్రాహం రీడ్. ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటల్ని వెల్లడించాడు.
"ప్రస్తుతం టీమిండియా జట్టు బలంగా ఉంది. ఆటగాళ్ల అనుభవం మాకు కలిసొస్తుంది. ఈ సిరీస్‌తో జట్టులోని లోపాల్ని సరిదిద్దుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ముందు ఈ మ్యాచ్‌లు చాలా ముఖ్యమైనవి."
-గ్రాహం రీడ్, హాకీ కోచ్
ఒలింపిక్స్‌లో పతకం గురించి మాట్లాడుతూ.. అది చాలా కఠినమైన సవాలని తెలిపాడు.