ఓ దివ్యాంగ చిన్నారి క్రికెట్ వీడియో.. దిగ్గజ సచిన్ తెందూల్కర్ మనసును హత్తుకుంది. అందులోని చిన్నారి మద్దా రామ్.. తన స్నేహితులతో క్రికెట్ ఆడుతూ కనిపించాడు. రెండుకాళ్లూ పనిచేయకున్నా, కూర్చొనే పాకుతూ పరుగు తీసి ప్రేరణ అందించాడు. ఇది తన హృదయాన్ని ద్రవింపజేసిందని మాస్టర్ పేర్కొంటూ... మీ గుండెలనూ పిండేస్తుందని అభిమానులకు చెప్పుకొచ్చాడు. 2020ని ఆరంభించేందుకు ఇంతకన్నా స్ఫూర్తిమంతమైన వీడియో ఇంకేముంటుందని అన్నాడు. సచిన్.. తన వీడియో షేర్ చేయడంపై స్పందించాడు ఆ చిన్నారి క్రికెటర్.
"క్రికెట్ దేవుడు సచిన్‌కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. నా వీడియో షేర్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మా ఊరికి రావాలని సచిన్‌ను కోరుతున్నా".