తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విభేదాలు బయట ఉంటే ప్రమాదం లేదు' - ROHIT SHARMA

ఆటగాళ్లకు విభేదాలున్న అవి మైదానం వెలుపల ఉన్నంతవరకు ఎటువంటి ప్రమాదం లేదని అన్నారు టీమిండియా మాజీ సారథి కపిల్​దేవ్. ఈ సందర్భంగా రోహిత్ శర్మ- విరాట్​ కోహ్లీ విషయంపై స్పందించారు.

'విభేదాలు బయట ఉంటే ప్రమాదం లేదు'

By

Published : Aug 1, 2019, 11:29 PM IST

టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ, ఓపెనర్​ రోహిత్​ శర్మకు ఒకవేళ విభేదాలు ఉన్నా అవి మైదానం వెలుపల ఉంచినంత కాలం ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పారు భారత్​ క్రికెట్​ జట్టు మాజీ సారథి కపిల్​ దేవ్.

టీమిండియా కెప్టెన్​ కోహ్లీతో రోహిత్ శర్మ

"బయట విభేదాలు ఉండొచ్చు. కానీ మైదానంలో మాత్రం ఆటపైనే దృష్టి ఉంటుంది. అక్కడ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అందరి లక్ష్యం మ్యాచ్​ గెలవడం పైనే ఉండాలి. భిన్నాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన ఒకరినొకరు తక్కువ చేసుకున్నట్లు కాదు. ఇలాంటి విషయాలపై ప్రసారం చేసేటపుడు మీడియా కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి." -కపిల్ దేవ్, టీమిండియా మాజీ సారథి

కపిల్ దేవ్​ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ టీమిండియా ప్రధాన కోచ్​ను ఎంపిక చేయనుంది.

ఇది చదవండి: 'కోహ్లీ కోరిన వ్యక్తే కోచ్ అయితే బెటర్' అని చెప్పిన సౌరవ్​ గంగూలీ

ABOUT THE AUTHOR

...view details