టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీకి సోమవారం కూతురు జన్మించింది. ఈ విషయాన్ని స్వయంగా అతడే సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. దాంతో పాటే ఈ అపురూప సమయంలో తమ కుటుంబ గోప్యతకు గౌరవం ఆశిస్తున్నట్లు చెప్పాడు. అయితే ఇప్పుడు తన కూతురి ఫొటోగా ఓ చిన్నారి పాదాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే అది పెట్టింది స్వయానా విరాట్ అన్న వికాస్ కోహ్లీ.
ఈ చిట్టి పాదాలు.. కోహ్లీ కూతురివేనా? - వికాస్ కోహ్లీ
టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తండ్రి అయ్యాడు. జనవరి 11న అతడి భార్య అనుష్క ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందాన్ని పంచుకుంటూ విరాట్ అన్న వికాస్ తన ఇన్స్టాలో ఓ ఫొటో పెట్టారు. ఇప్పుడు అది సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
![ఈ చిట్టి పాదాలు.. కోహ్లీ కూతురివేనా? Did uncle Vikas share first photo of Virat Kohli, Anushka Sharma's baby girl?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10211453-thumbnail-3x2-yv.jpg)
ఈ చిట్టి పాదాలు.. కోహ్లీ కూతురివేనా?
శుభవార్తను విరాట్ వెల్లడించిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో తన సంతోషాన్ని పంచుకున్నారు వికాస్. "సంతోషంగా ఉంది.. ఇంట్లోకి దేవత వచ్చింది" అని పోస్టు చేశారు. దానితో పాటే ఓ చిన్నారి పాదాలు ఉన్న ఫొటో జతచేశారు. అయితే ఈ చిత్రంలో ఉన్నది విరాట్ గారాలపట్టి అని నిర్ధరణ కాలేదు. ఫొటో పెట్టిన కొద్దిసేపటికే విరాట్ కూతురు అంటూ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇదీ చూడండి:భారత కెప్టెన్ కోహ్లీ దంపతులకు ఆడపిల్ల