తెలంగాణ

telangana

ETV Bharat / sports

'భారత జట్టులో చోటు దక్కుతుందని ఊహించలేదు' - Did not expect to debut for India in Aus

భారత జట్టుకు ఆడడం తన కల అని పేసర్​ నటరాజన్​ పేర్కొన్నాడు. ఒకే పర్యటనలో మూడు ఫార్మాట్లలో చోటు దక్కడంపై ఆనందం వ్యక్తం చేశాడు. కోచ్​లతో పాటు ఆటగాళ్లు వెన్నుతట్టి ప్రోత్సహించారని తెలిపాడు.

Did not expect to debut for India in Aus; was under pressure in first match: Natarajan
'భారత జట్టులో చోటు దక్కుతుందని ఊహించలేదు'

By

Published : Jan 24, 2021, 8:50 PM IST

నెట్​ బౌలర్​గా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన తనకు భారత జట్టులో అవకాశం వస్తుందని ఊహించలేదని పేసర్​ నటరాజన్​ పేర్కొన్నాడు. ప్రారంభ సిరీస్​లోనే అదరగొట్టిన నట్టు.. జట్టులో చోటు దక్కిందనగానే ఎంతో ఒత్తిడికి లోనైనట్టు తెలిపాడు.

ఒకే పర్యటన​లో మూడు ఫార్మాట్లలోనూ అరంగ్రేటం చేసిన ఏకైక భారత ఆటగాడిగా నటరాజన్​ చరిత్ర సృష్టించాడు. తొలి మ్యాచ్​ను డిసెంబర్​ 2న కాన్​బెర్రాలో జరిగిన మూడో వన్డేలో ఆడిన నట్టూ.. సుదీర్ఘ ఫార్మాట్​లోకి మాత్రం చివరిదైన నాలుగోవ టెస్టులో అడుగుపెట్టాడు.

నా కర్తవ్యం నిర్వహించడం ఆనందంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్​లో అవకాశం వస్తుందని ఊహించలేదు. ఆ విషయం తెలిసినప్పుడు ఒత్తిడికి లోనయ్యాను. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నాను. ఇండియాకు ఆడి.. వికెట్లు సాధించాలనేది నా కల. అది నిజమైంది.

-నటరాజన్​, భారత పేసర్​.

"ఇండియాకు ఆడడంపై నా సంతోషాన్ని మాటాల్లో చెప్పలేను. కోచ్​లు, తోటి వారి నుంచి మద్దతు లభించింది. వాళ్లు నన్నెంతో ప్రోత్సహించారు. వాళ్లు వెన్నంటే నిలవడం వల్లే నేను మెరుగ్గా ఆడగలిగాను," అని నట్టు పేర్కొన్నాడు.

విరాట్​, రహానేలు తనలో సానుకూల దృక్పథం నింపారని ఈ 29ఏళ్ల పేసర్​ అభిప్రాయపడ్డాడు. ఇరువురి సారథ్యంలో ఆడటం ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు.

ఇదీ చదవండి:'వారసత్వ రాజకీయంపై భాజపా ఆ చట్టం తేగలదా?'

ABOUT THE AUTHOR

...view details