తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇదిగో.. ఈ యెటకారాలే వద్దనేది వాన్‌' - జోరూట్​ 100వ టెస్టు మైకేల్​ వాన్​

ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్​ మైకేల్​ వాన్​ను భారత అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంగ్లాండ్​పై తొలి టెస్టులో ఓటమి చెందడంపై టీమ్ఇండియాను అతడు విమర్శించాడు. ఈ కారణంగానే అతడిపై నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు.

vaughan
వాన్​

By

Published : Feb 10, 2021, 8:56 PM IST

ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ను నెటిజన్లు విమర్శిస్తున్నారు. అతడు నోటి దురుసుతనం తగ్గించుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఎత్తి పొడుపులు, అపహాస్యం చేయడం తగదని హితవు పలికారు. బ్రిటిషర్లు 150 ఏళ్లు భారత్‌ను దొచుకున్నారని.. ముందు కోహినూర్‌ను ఇవ్వాలని ఘాటుగా బదులిస్తున్నారు. టీమ్‌ఇండియా ఓటమి తర్వాత అతడు ఎగతాళిగా ట్వీట్‌ చేయడమే ఇందుకు కారణం.

'నాథన్​ లైయన్‌ వందో టెస్టు సందర్భంగా గబ్బా విజయం తర్వాత టీమ్‌ఇండియా అతడికి సంతకాలు చేసిన జెర్సీని బహూకరించింది. (టీమ్‌ఇండియా) ఓడిపోయాక రూట్‌ అలాంటిదేమైనా అందుకున్నాడా? అలా జరిగిందని అనుకోను. ఎవరైనా ధ్రువీకరిస్తారా?' అని మైకేల్‌ వాన్‌ మంగళవారం ట్వీట్‌ చేశాడు.

చెపాక్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌ రూట్‌ కెరీర్లో వందో టెస్టు. ఈ మ్యాచులో అతడు ద్విశతకంతో చెలరేగాడు. ఆఖరి రోజు పిచ్‌ విపరీతంగా టర్న్‌కు సహకరించడం వల్ల టీమ్‌ఇండియా ఓటమి చవిచూసింది. 420 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక పోయింది. ఆ మ్యాచు ముగిశాక వాన్‌ పై విధంగా ట్వీట్‌ చేయడం వల్ల భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"మీరిప్పటికే 150 ఏళ్లు మమ్మల్ని దోచుకున్నారు. దేశభక్తులు ఎందరినో చంపేశారు. ముందు మీరు కోహినూర్‌ ఇవ్వండి. ఆ తర్వాత మేం టీ-షర్ట్‌ ఇవ్వడం గురించి ఆలోచిస్తాం" అని ఓ నెటిజన్‌ వాన్‌కు బదులిచ్చాడు. 'భారత్‌ రూట్‌కు సంతకాలు చేసిన టీషర్ట్‌ ఇస్తుంది. మీరు టీమ్‌ఇండియాను గెలవనివ్వండి. మరీ అతిచేయకండి సర్‌. పుంజుకోవడం భారత్‌కు అలవాటే. తర్వాత టెస్టులో ఇందుకు సిద్ధం కండి' అని మరో అభిమాని అన్నాడు.

ఇదీ చూడండి:'భారత్​ విషయంలోనూ ఆసీస్​ అలానే చేస్తుందా?'

ABOUT THE AUTHOR

...view details