టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీకి మించిన క్రేజ్ మరే ఇతర క్రికెటర్‌కు ఉండదని అభిప్రాయపడ్డాడు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. పాపులారిటీలో క్రికెట్ దేవుడు సచిన్ తెందుల్కర్, ప్రస్తుత టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీని అధిగమించాడని అన్నాడు.
సచిన్(ముంబయి), కోహ్లీ(దిల్లీ) వంటి మెట్రో నగరాల నుంచి వచ్చారు. వారికి క్రికెట్ పట్ల అవగాహన ఎక్కువే ఉంటుంది. కానీ ధోనీ క్రికెట్ సంస్కృతి తెలియని రాంచి నుంచి వచ్చాడు. ఓ సాధారణమైన మనిషి. అందుకే దేశం మొత్తం అతడిని ప్రేమిస్తోంది.