తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ జరగకపోతే ధోనీకి కష్టమంటోన్న మాజీలు - క్రికెట్​ న్యూస్​

భారత క్రికెట్​ జట్టులోకి ధోనీని ఎంపిక చేసే అవకాశాలు క్రమంగా సన్నగిల్లుతున్నాయన్నాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ శ్రీకాంత్​. ఈ ఏడాది ఐపీఎల్​ నిర్వహించకపోతే టీ20 ప్రపంచకప్​ తుది జట్టులో అతడి స్థానం అనుమానమే అని అంటున్నాడు.

Dhoni's chances for T20 World Cup 'very, very bleak' without IPL 2020: Kris Srikkanth
'ఐపీఎల్​ జరగకపోతే ధోని ఎంపిక డౌటే!'

By

Published : Apr 13, 2020, 12:30 PM IST

టీ20 ప్రపంచకప్​ జట్టులో ధోనీ స్థానంపై అనుమానం వ్యక్తం చేశారు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్లు​ శ్రీకాంత్, గంభీర్​. ఈ ఏడాది ఐపీఎల్​ జరగకపోతే తను జట్టులోకి రావటానికి అవకాశాలు పూర్తిగా మందగిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.

"ఈ ఏడాది ఐపీఎల్ నిర్వహించక పోతే ధోనీ జట్టులోకి వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయి . సూటిగా చెప్పాలంటే కేఎల్​ రాహుల్​ అటు బ్యాట్స్​మన్​గా, వికెట్​ కీపర్​గా మంచి ప్రతిభ కనబరుస్తున్నాడు. రిషబ్ ​పంత్​ను కొంతమేర పరిశీలించాల్సి ఉన్నా.. అతడూ ఉత్తమ ప్రదర్శన చేయగలడు. ధోనీని జట్టులోకి తీసుకోవద్దనే ఆలోచన నాలో లేదు కానీ, అతడి ఎంపిక ఐపీఎల్​ ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. నేను భారత జట్టు సెలక్షన్​ కమిటీ ఛైర్మన్​ అయితే ఏం జరిగి ఉండేదో చెప్తున్నా. అంతే తప్ప దీనిపై నేను ఎలాంటి రాయబారాలు చేయటం లేదు."

-శ్రీకాంత్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​

మహేంద్రసింగ్​ ధోని కెరీర్​ వివరాలు

ఈ విషయంపై తాజాగా మాజీ క్రికెటర్​, దిల్లీ లోక్​సభ సభ్యుడు గౌతమ్​ గంభీర్ కూడా​ స్పందించాడు. ఐపీఎల్​ రద్దయితే ప్రపంచకప్​ తుది జట్టులో ధోనీ స్థానం అనుమానమే అని అన్నాడు. అయితే టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ వీవీఎస్​ లక్ష్మణ్ మాత్రం​ అందుకు భిన్నంగా స్పందించాడు. ఏది ఏమైనా మరి కొంతకాలం ధోనీ ఆటలో నిలకడగా రాణిస్తాడని.. విరామం వచ్చినా తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ఐపీఎల్​ జట్టు చెన్నై సూపర్​కింగ్స్​ను కెప్టెన్​గా ముందుండి నడిపిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.

2019 ప్రపంచకప్​ తర్వాత ధోనీ ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్​లకు ప్రాతినిధ్యం వహించలేదు. ఐపీఎల్​ ప్రదర్శన ఆధారంగా మహీ జట్టులోకి వస్తాడని ఇటీవలే ​ టీమ్​ఇండియా ప్రధానకోచ్ రవిశాస్త్రి తెలిపాడు.

ఇదీ చూడండి.. విరామం వచ్చినా బంతిని బాదడంలో మార్పులేదు!

ABOUT THE AUTHOR

...view details