తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ సలహాల వల్లే​ నటరాజన్ ఇలా! - cricket news

గత ఐపీఎల్​ సీజన్​లో ధోనీ సలహాలు తనకెంతో ఉపయోగపడ్డాయని నటరాజన్ చెప్పాడు. అలానే ధోనీ, డివిలియర్స్​ వికెట్లు తీసిన సందర్భాల్ని గుర్తు చేసుకున్నాడు. సన్​రైజర్స్ హైదరాబాద్​కు ఆడుతున్న ఇతడు.. త్వరలో మొదలయ్యే కొత్త సీజన్​కు సిద్ధమవుతున్నాడు.

Dhoni's advice to bowl more slow bouncers and cutters has been useful: Natarajan
నటరాజన్

By

Published : Apr 7, 2021, 5:25 PM IST

చెన్నై సూపర్‌కింగ్స్‌ సారథి ఎంఎస్‌ ధోనీ తనకు విలువైన సలహాలు ఇచ్చారని యువపేసర్‌ నటరాజన్‌ అన్నాడు. నెమ్మది బౌన్సర్లు, కట్టర్లు ఎక్కువగా వేయాలని సూచించాడని చెప్పాడు. వాటివల్లే గత ఐపీఎల్‌లో ఎక్కువ వికెట్లు తీయగలిగానని వెల్లడించాడు. ఆ సీజన్లో ధోనీ, డివిలియర్స్‌ వంటి దిగ్గజాలను నట్టూ పెవిలియన్‌కు పంపడమే కాకుండా 71 యార్కర్లు విసరడం విశేషం.

'మహీలాంటి వాళ్లతో మాట్లాడటమే గొప్ప విషయం. ఆయన నాతో ఫిట్‌నెస్‌ గురించి మాట్లాడారు. చక్కగా బౌలింగ్‌ చేస్తున్నావని అన్నారు. అనుభవంతో మరింత మెరుగవుతానని ప్రోత్సహించారు. నెమ్మది బౌన్సర్లు, కట్టర్లు, వైవిధ్యమైన బంతులు వేయాలని సూచించారు. అవి నాకెంతో ఉపయోగపడ్డాయి' అని నటరాజన్‌ చెప్పాడు.

ధోనీతో నటరాజన్

సీఎస్‌కేతో మ్యాచులో ధోనీ వికెట్‌ తీసిన విధానాన్ని నట్టూ గుర్తుచేసుకున్నాడు. 'నేను వేసిన ఓ బంతిని మహీ 102 మీటర్ల సిక్సర్‌ బాదేశారు. ఆ తర్వాతి బంతికే వికెట్‌ తీశాను (సంబరాలు చేసుకోలేదు). అయినా సరే అంతకు ముందు బంతి గురించే ఆలోచించసాగాను. డ్రస్సింగ్‌ రూమ్‌కు వచ్చాక ఎంతో ఆనందించాను. ఆ మ్యాచ్‌ ముగిశాక ధోనీతో మాట్లాడాను' అని నట్టూ తెలిపాడు.

బెంగళూరుతో మ్యాచులో ఏబీ డివిలియర్స్‌ను పెవిలియన్‌కు పంపించాడు నటరాజన్‌. అదే రోజు అతడు తండ్రయ్యాడు. ఏబీ వికెట్‌ తీసినందుకు చాలా సంతోషం కలిగిందన్నాడు. తనకు బిడ్డ పుట్టిన విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదన్నాడు. మ్యాచ్‌ ముగిశాక అందరికీ చెప్పాలనుకున్నానని వివరించాడు. కానీ మ్యాచ్‌ ముగిసి అవార్డులు ఇచ్చేటప్పుడు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ విషయం అందరికీ చెప్పేశాడని వెల్లడించాడు.

ABOUT THE AUTHOR

...view details