టీమ్ఇండియా మాజీ సారథి ధోనీకి బర్డ్ ఫ్లూ సెగ తాకింది. మహీ కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారానికి ఆటంకం కలిగింది. అత్యధిక పోషక విలువులున్న ఈ కోళ్ల ఫామ్‌ను స్వస్థలం రాంచీలో త్వరలో తెరిచేందుకు ధోనీ సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి బృందం, మధ్యప్రదేశ్ జబువా జిల్లాకు చెందిన ఓ పౌల్ట్రీతో 2000 కోళ్ల కోసం ఒప్పందాన్ని చేసుకుంది.
ధోనీ వ్యాపారాన్ని తాకిన బర్డ్ ఫ్లూ సెగ! - 'Kadaknath hens dhoni order cancell
కడక్‌నాథ్ కోళ్ల వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న టీమ్ఇండియా మాజీ సారథి ధోనీకి చుక్కెదురైంది. అతడు ఆర్డర్ చేసిన పౌల్ట్రీలోని ఈ జాతికి చెందిన 2000 కోళ్లు బర్డ్ ఫ్లూ సోకి మరణించాయి.
ధోనీ
అయితే కొంతకాలం నుంచి బర్డ్ ఫ్లూ సోకి కోళ్లు లక్షల సంఖ్యలో చనిపోతున్నాయి. ఈ క్రమంలోనే ధోనీ అర్డర్ చేసిన పౌల్ట్రీలోని కడక్‌నాథ్ కోళ్లకు ఈ రోగం సోకింది. దీంతో అవి మరణించాయి. ఫలితంగా మహీ ఆర్డర్ రద్దయింది.
ఇదీ చూడండి : ఒకే ఫ్రేమ్‌లో ధోనీ, జీవా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్