మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ మైదానంలోకి ఎప్పుడు అడుగుపెడతాడు? లేదా రిటైర్మెంట్ ప్రకటిస్తాడా? అయితే ఎప్పుడు? గత కొంత కాలంగా ధోనీ అభిమానులనే కాకుండా.. సగటు క్రికెట్ ప్రేక్షకుడిని వెంటాడుతున్న ప్రశ్న. ఇప్పుడు దీనికి సమాధానం దొరికింది. వచ్చే ఐపీఎల్ తర్వాత తన భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తాడట మహీ. ఈ విషయాన్ని ధోనీ సన్నిహితులొకరు చెప్పారు.
"ఒకవేళ భవిష్యత్తు కార్యచరణ గురించి ధోనీ నిర్ణయం తీసుకుంటే అది వచ్చే ఐపీఎల్ తర్వాతే. అంత పెద్ద క్రికెటర్ అయినా, ధోనీపై వస్తున్న ఊహాగానాలను ఆపలేం. ఫిట్నెస్ విషయంలో మహీ చాలా శ్రద్ధ వహిస్తాడు. ప్రస్తుతం చాలా ఫిట్‌గా ఉన్నాడు. గత నెలలోనూ తీవ్రంగా కసరత్తులు చేశాడు. ఐపీఎల్ కంటే ముందు అతడు ఎన్ని మ్యాచ్‌ల్లో ఆడాలనుకుంటాడో త్వరలో తెలుస్తుంది" -ధోనీ సన్నిహితులు