తెలంగాణ

telangana

ETV Bharat / sports

సాక్షి సింగ్​ ఆ ట్వీట్​ ఎందుకు తొలగించారంటే.?

భారత సీనియర్​ క్రికెటర్​ ధోనీ రిటైర్మెంట్​ ఇచ్చారని ఇటీవల ట్విట్టర్​లో పెద్ద చర్చ జరగ్గా.. దాన్ని ఖండించారు ఆయన సతీమణి సాక్షి సింగ్​. అవన్నీ పుకార్లే అని కొట్టిపడేసిన ఆమె.. కాస్త అసహనం చేస్తూ ట్వీట్​ చేశారు. అయితే కాసేపటి తర్వాత దాన్ని తొలగించడంపై తాజాగా క్లారిటీ ఇచ్చారామె.

Dhoni Wife Sakshi Singh finally Clarified about her deleted tweet on DhoniRetires
సాక్షి సింగ్​ ఆ ట్వీట్​ ఎందుకు తొలగించారంటే..?

By

Published : Jun 2, 2020, 7:44 AM IST

టీమ్‌ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ రిటైర్మెంట్‌పై చాలాకాలం నుంచే సామాజిక మాధ్యమాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల కూడా 'ధోనీ రిటైర్స్'​ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్​లో ట్రెండింగ్‌గా మారింది. అదే రోజు ఆ విషయంపై స్పందించిన ధోనీ సతీమణి సాక్షి.. అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. లాక్‌డౌన్‌.. ప్రజల మానసిక పరిస్థితిని మార్చేసిందని తీవ్రంగా వ్యాఖ్యానించారు. అయితే, ఆ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే ఆమె దాన్ని డిలీట్‌ చేశారు. దీంతో సాక్షి ఎందుకలా చేశారనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

సాక్షి తొలగించిన ట్వీట్​ ఇదే

ఇన్​స్టాలో క్లారిటీ..

సాక్షి సింగ్​ ఆదివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌ అధికారిక ఇన్‌స్టా లైవ్‌చాట్‌లో రూపా రమణి అనే మహిళతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె ధోనీ రిటైర్మెంట్‌పై చేసిన ట్వీట్‌ను ఎలాంటి పరిస్థితుల్లో తొలగించాల్సి వచ్చిందో చెప్పారు.

"ఆరోజు నాకు ఓ స్నేహితురాలు మెసేజ్‌ చేసి.. ఏం జరుగుతోందని అడిగింది. మధ్యాహ్నం నుంచి ధోనీ రిటైర్స్​ అనే హ్యాష్‌ట్యాగ్‌‌ ట్రెండింగ్‌లో ఉందని చెప్పింది. దాంతో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అవన్నీ పుకార్లని ట్వీట్‌ చేశా. తర్వాత దాన్ని డిలీట్‌ చేశా. ఏదేమైనా నేను చెప్పాలనుకుంది చెప్పేశా. నా పని అయిపోయింది. సందేశం బయటకు తెలిసింది" అని సాక్షి వివరించారు. అలాగే లాక్‌డౌన్ వేళ ధోనీ ఇంట్లో ఏం చేశాడనే విషయాన్ని సాక్షి వెల్లడించారు. ఆ సమయంలో మహీ ఏడు పాత బైకులకు కొత్త పరికరాలు అమర్చాడని ఆమె చెప్పుకొచ్చారు.

ఇదీ చూడండి: ధోనీకి 'పబ్​జీ' పిచ్చి.. నిద్రలోనూ కలవరింత!

ABOUT THE AUTHOR

...view details