మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ ఐపీఎల్లో విజయవంతమైన కెప్టెన్లు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ధోనీ మూడు టైటిల్స్ అందించగా.. ముంబయి ఇండియన్స్‌ను నాలుగు సార్లు విజేతగా నిలిపాడు రోహిత్. అయితే ఈ ఇద్దరి కెప్టెన్సీలు వేరువేరుగా ఉంటాయి. తాజాగా మైదానంలో వీరి ఆలోచనా విధానాన్ని పంచుకున్నాడు వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్.
"ధోనీ అందరిలాంటి కెప్టెన్ కాదు. ఇది చెయ్, అది చెయ్ అని ఆటగాళ్లకు చెప్పాడు. నువ్వేం చేయగలవో అది మాత్రమే చేయమని కోరుకునే సారథి. వికెట్ల వెనుక ఉండే ధోనీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఎలా ఆడాలనుకుంటున్నారో గ్రహించి ఆ సమాచారాన్ని అందిస్తాడు, తర్వాత బ్యాట్స్‌మెన్‌ను ఎలా కట్టడి చేయాలనుకుంటే.. అది నీపైనే ఆధారపడి ఉంటుంది. ఒకసారి పుణెలో శార్దూల్ ఠాకుర్ బాగా పరుగులిస్తున్నాడు. నేను ధోనీ వద్దకెళ్లి.. శార్దూల్‌ను యాంగిల్ మార్చమని ఎందుకు చెప్పవని అడిగా. అప్పుడు ధోనీ ఇలా అన్నాడు. 'భజ్జూ పా.. ఇప్పుడు నేనేమైనా చెబితే శార్దూల్ తికమకపడతాడు. అతడెలా వేయాలనుకుంటే అలానే కానీయ్. పరుగులు సమర్పించకున్నా పర్లేదు' అని చెప్పాడు"
-హర్భజన్, వెటరన్ క్రికెటర్