తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్-దక్షిణాఫ్రికా చివరి టెస్టుకు ధోనీ..! - dhoni attend to ranchi test

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే మూడో టెస్టుకు టీమిండియా మాజీ సారథి ధోనీ హాజరుకానున్నాడు. కొంత కాలంగా  జట్టుకు దూరంగా ఉన్న మహీ.. మైదానంలో అభిమానులకు కనువిందు చేయనున్నాడు.

ధోనీ

By

Published : Oct 18, 2019, 7:40 PM IST

తాత్కాలిక విరామం తీసుకొని, జట్టుకు దూరంగా ఉన్నాడు టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. శనివారం నుంచి రాంచీలో ప్రారంభమయ్యే భారత్-దక్షిణాఫ్రికా మూడో టెస్టు మ్యాచ్​ చూసేందుకు వస్తున్నాడు. ఝార్ఖండ్‌ మాజీ కెప్టెన్‌, ధోనీ చిన్ననాటి మిత్రుడు మహీర్‌ దివాకర్‌తో కలిసి వీక్షించనున్నాడు. శనివారం ఉదయమే అక్కడికి చేరుకుంటాడని దివాకర్ తెలిపాడు.

ప్రపంచకప్​ తర్వాత వ్యక్తిగత పనులతో బిజీగా ఉంటున్నాడు ధోనీ. ఈ క్రమంలో రిటైర్మెంట్​ ప్రకటిస్తాడనే వార్తలూ వచ్చాయి. అయితే రాంచీ మ్యాచ్​ చూడటానికి ధోనీ వస్తే ఈ విషయంపై ఏమైనా స్పష్టత వస్తుందేమోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇవీ చూడండి.. అద్భుతంగా క్యాచ్​ పట్టిన ఆస్ట్రేలియా క్రికెటర్

ABOUT THE AUTHOR

...view details