మైదానంలో మెరుపులు మెరిపించే మహేంద్రసింగ్ ధోనీ సినీ రంగంలోనూ ప్రవేశించనున్నాడా! అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌వర్గాలు. హీరోగా మాత్రం కాదులేండి. సైనిక అధికారుల జీవితగాథలను ఓ టీవీ సిరీస్‌గా నిర్మించనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.
పరమవీర చక్ర, అశోకచక్ర అవార్డుల గ్రహీతల జీవితంలోని సంఘటనలను సిరీస్ రూపంలో ఓ టీవీ షో నిర్మించనుంది స్టూడియో నెక్స్ట్ సంస్థ. ఈ సిరీస్‌కు మహీ సహా నిర్మాతగా వ్యవహరించనున్నాడట. సోనీ పిక్చర్స్ నెట్వర్క్.. ఇందులో భాగస్వామ్యం కానుంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలోనే ఉన్న ఈ సిరీస్, త్వరలో పట్టాలెక్కనుంది.