టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ ప్రతిభను గుర్తుచేసుకున్నాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్. అతడి సేవలు జట్టుకు ఇంకా అవసరమని అభిప్రాయపడ్డాడు. తద్వారా కోహ్లీసేన మరిన్ని విజయాలను అందుకుంటుందని అన్నాడు. ఏడేళ్ల క్రితం ధోనీ సారథ్యంలో భారత్ ఛాంపియన్ ట్రోఫీ గెల్చుకుంది. ఈ నేపథ్యంలో మూడు ఐసీసీ ట్రోఫీలను సాధించిన భారత తొలి కెప్టెన్గా అతడు ఘనత సాధించాడు. ఈ విషయమై ట్వీట్ చేసిన కైఫ్.. పైవిధంగా రాసుకొచ్చాడు.
"సరిగ్గా ఏడేళ్ల క్రితం ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది భారత్. తద్వారా మూడు ఐసీసీ ట్రోఫీలు ఛాంపియన్ ట్రోఫీ(2013), వరల్డ్ టీ20కప్(2011), డబ్లుటీ 20(2007) ముద్దాడిన ఏకైక కెప్టెన్ ధోనీనే. టీమ్ఇండియాకు ఇలాంటి విజయాలను అతడు అందించాల్సిన అవసరం ఇంకా ఉంది"