మైదానంలో కూల్‌గా ఉంటూ.. ప్రత్యర్థుల వ్యూహాలను ముందే పసిగట్టండలో మహేంద్రసింగ్ ధోనీ దిట్ట. ప్రస్తుతం క్రికెట్‌కు తాత్కాలిక విరామం తీసుకున్న మహీ.. ఓ కార్యక్రమంలో సింగర్ అవతామెత్తి పాట పాడుతూ అలరించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమల్లో వైరల్ అవుతోంది.
అమితాబ్ బచ్చన్ సినిమా కబీ కబీలోని మెలోడీ సాంగ్ పాడుతూ ఆకట్టుకున్నాడు మహీ. ధోనీ గాయకుడిగా మారడం ఇదే తొలిసారి కాదు. ఇటీవల కుటుంబంతో కలిసి సరదాగా గడిపిన కార్యక్రమంలోనూ స్నేహితుడితో కలిసి గొంతు కలిపాడు. బాలీవుడ్ చిత్రం జుర్మ్‌లో జబ్ కోయ్ బాత్ బిగాద్ జయా పాటను పాడాడు.