ఆర్మీ అంటే టీమిండియా సారథి ధోనీకి ఎంత ఇష్టమో చాలా సార్లు చూశాం. తాజాగా ఆర్మీపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడీ క్రికెటర్. అయితే ఈ సారి కాస్త విభిన్నంగా భారత సైనికులు ఉపయోగించే 'నిసాన్ జోంగా' మోడల్ జీపును మహేంద్రుడు కొనుగోలు చేశాడు.
ప్రస్తుతం రాంచీ వీధుల్లో ఈ వాహనాన్ని నడుపుతూ ఆస్వాదించడంలో బిజీగా ఉన్నాడు ధోనీ. కొత్త జీపు నడుపుతూ తన ఇంటికి సమీపంలోని ఓ పెట్రోల్ బంకు వద్దకు వెళ్లాడు. విషయం తెలుసుకున్న వెంటనే అభిమానులు ఒక్కసారిగా ఆయన వద్దకు చేరుకుని ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. వారిని మహీ నిరుత్సాహపరచకుండా సెల్ఫీలు దిగి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు.