తెలంగాణ

telangana

ETV Bharat / sports

సేంద్రీయ ఎరువులకు అంబాసిడర్​గా ధోనీ - ధోనీ లేటెస్ట్​ న్యూస్​

లాక్​డౌన్​లో వ్యవసాయం చేస్తున్న మాజీ కెప్టెన్ ధోనీ.. త్వరలో సేంద్రీయ ఎరువులను సొంతంగా తయారు చేసి వాటికి బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని మహీ మేనేజర్​ తెలిపారు.

Dhoni says no to brand endorsements amid pandemic, keeps busy with organic farming
సేంద్రీయ ఎరువుల తయారీలో అడుగుపెట్టనున్న ధోనీ

By

Published : Jul 8, 2020, 9:35 AM IST

Updated : Jul 8, 2020, 9:04 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ఈ పరిస్థితిలో ఎలాంటి బ్రాండ్లకు ప్రచారం చేయకూడదని నిర్ణయించుకున్నాడు మహేంద్రసింగ్​ ధోనీ. బదులుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూ బిజీ అయిపోయాడు. పర్యావరణానికి అనుకూలమైన ఎరువుల తయారీ బ్రాండ్​ను త్వరలో ప్రారంభించి, వాటికి బ్రాండ్​ అంబాసిడర్​గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని అతడి మేనేజర్​, చిన్ననాటి స్నేహితుడు మిహిర్​ దివాకర్​ వెల్లడించారు.

"దేశభక్తి ధోనీ రక్తంలోనే ఉంది. రక్షణ శాఖలో అయినా, వ్యవసాయ రంగంలోనైనా దేశానికి సేవచేయడం కోసమే అతను ఇష్టపడతాడు. ధోనీకి 40-50 ఎకరాలు పంటభూములు ఉన్నాయి. అందులో సేంద్రీయ పంటలైన అరటి, బొప్పాయిలను పండిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు కుదట పడే వరకు ఎలాంటి బ్రాండ్​కు ప్రచారం చేయనని అతడు నాతో చెప్పాడు"

- మిహిర్​ దివాకర్​,​ ధోనీ మేనేజర్​

"మాకు కొంతమంది వ్యవసాయ రంగ నిపుణులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వారు అభివృద్ధి చేసిన సేంద్రీయ ఎరువులను రెండు-మూడు నెలలో మార్కెట్​లో ప్రవేశపెట్టనున్నాం. ధోనీతో గతరాత్రే మాట్లాడాను. కుటుంబంతో కలిసి తన పుట్టినరోజు జరుపుకుంటున్నానని చెప్పాడు" అని దివాకర్ తెలిపారు​. రిటైర్​మెంట్​ గురించి ధోనీ ప్రస్తుతం ఆలోచించడం లేదని.. ఐపీఎల్​లో పాల్గొనే క్రమంలో కరోనా వ్యాప్తి కారణంగా టోర్నీ రద్దయిందని అన్నారు​.

ఇదీ చూడండి...టాప్​-6: ధోనీ కెరీర్​లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్​లు

Last Updated : Jul 8, 2020, 9:04 PM IST

ABOUT THE AUTHOR

...view details