తెలంగాణ

telangana

ETV Bharat / sports

'క్రికెట్​ గ్రౌండ్​ నుంచి గోల్ఫ్ మైదానానికి ధోని' - golf court

క్రికెట్​కు​ రెండు నెలలు విరామం ప్రకటించిన భారత క్రికెటర్ మహేంద్ర సింగ్​ ధోని​ ... ఇటీవలే భారత సైన్యంలో పనిచేసి వచ్చాడు. తాజాగా అమెరికాలో గోల్ఫ్​ ఆడుతూ కనిపించాడు. మహీతో కలిసి ఉన్న ఫొటోను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు తోటి ఆటగాడు కేదార్​ జాదవ్​.

'క్రికెట్​ గ్రౌండ్​ నుంచి గోల్ఫ్ మైదానానికి ధోని'

By

Published : Aug 30, 2019, 11:18 AM IST

Updated : Sep 28, 2019, 8:26 PM IST

రెండు నెలలు క్రికెట్​కు తాత్కాలిక విరామం ప్రకటించిన ధోని.. ప్రస్తుతం అమెరికాలో సందడి చేస్తున్నాడు. అక్కడ గోల్ఫ్​ ఆడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు కేదార్ జాదవ్.

" అందరికీ జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ఆగస్టు 29న దిగ్గజ హాకీ ఆటగాడు ధ్యాన్​చంద్​ పుట్టిన రోజు సందర్భంగా అతడిని స్మరించుకున్నాం ".
-- కేదార్​ జాదవ్​, భారత క్రికెటర్​

గోల్ఫ్​ మైదానంలో కేదార్​, ధోని

తాజాగా దక్షిణాఫ్రికా టీ 20 జట్టులో ధోనిని ఎంపిక చేయలేదు సెలక్టర్లు.ప్రస్తుతం విండీస్​ టూర్​లో ఉన్న టీమిండియా జట్టులో కేదార్​ జాదవ్​ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. కేదార్​, ధోని చెన్నై సూపర్​ కింగ్స్​ జట్టులోని సభ్యులు. ఇటీవల ప్రపంచకప్​లోనూ వీరిద్దరూ టీమిండియా తరఫున ఆడారు.

మహీ లేకుండానే విండీస్​ టూర్​ వెళ్లిన కోహ్లీ సేన .. అద్భుతమైన ఆటతీరుతో టీ20, వన్డే సిరీస్​ను సొంతం చేసుకుంది. ఇప్పటికే తొలి టెస్టు భారత జట్టు కైవసం చేసుకోగా.. చివరి టెస్టు మ్యాచ్​ నేడు జమైకా వేదికగా ప్రారంభం కానుంది.

Last Updated : Sep 28, 2019, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details