తెలంగాణ

telangana

ETV Bharat / sports

పరిమిత ఓవర్ల కెప్టెన్​గా ధోనీ, టెస్టులకు కోహ్లీ - Kohli

వన్డే, టీ20ల్లో ఈ దశాబ్దపు అత్యుత్తమ కెప్టెన్​గా మహేంద్రసింగ్ ధోనీని ఎంపిక చేసింది ఈఎస్​పీఎన్ క్రిక్​ఇన్ఫో. టెస్టుల్లో విరాట్ కోహ్లీని సారథిగా తీసుకుంది.

Dhoni picked captain of ESPNCricinfo's ODI and T20 teams of past decade
ధోనీ - కోహ్లీ

By

Published : Jan 1, 2020, 3:01 PM IST

Updated : Jan 1, 2020, 3:09 PM IST

ప్రముఖ క్రీడాసంస్థ ఈఎస్​పీఎన్ క్రిక్​ఇన్ఫో.. ఈ దశాబ్దపు అత్యుత్తమ క్రికెట్ జట్లను ప్రకటించింది. పరిమిత ఓవర్ల ఫార్మాట్​కు కెప్టెన్​గా మహేంద్ర సింగ్ ధోనీని.. టెస్టులకు విరాట్ కోహ్లీని సారథిగా ఎంపిక చేసింది.

జట్టులో తీసుకునేందుకు అర్హతగా కనీసం 75 వన్డేలు, 100 టీ20ల్లో ప్రాతినిధ్యం వహించిన వారికి అవకాశమిచ్చింది 23 మంది సభ్యులు సెలక్షన్ ప్యానెల్​. దీర్ఘకాలిక ఫార్మాట్లో 50 టెస్టులు లేదా ఆరేళ్ల పాటు​ ఆడిన వాళ్లను తీసుకుంది.

టెస్టు జట్టు

భారత్​ నుంచి ఆఫ్​ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. 11 మందితో కూడిన టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్​ కుక్, న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్​కు ఈ జట్టులో స్థానం లభించింది.

అన్ని ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న ఏకైక భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ వన్డే జట్టులో స్థానం లభించింది. వీరు కాకుండా విండీస్ ఆటగాళ్లు క్రిస్ గేల్, డ్వేన్ బ్రేవో, సునీల్ నరైన్, కీరన్ పొలార్డ్, ఆండ్రూ రసెల్.. టీ20 జట్టులో ఎంపికయ్యారు.

మహిళల జట్టులో మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వన్డే, టీ20 జట్లలో స్థానం సంపాదించారు. ఆస్ట్రేలియా క్రికెటర్ మెగ్ లానింగ్.. రెండు జట్లకూ కెప్టెన్​గా ఎంపికైంది.

ఇదీ చదవండి: తండ్రి కంటే ఏదీ ఎక్కువ కాదు: బెన్ స్టోక్స్​

Last Updated : Jan 1, 2020, 3:09 PM IST

ABOUT THE AUTHOR

...view details