టీమ్ఇండియా మాజీ సారథి ధోనీ ఎప్పటికప్పుడు కొత్త లుక్‌తో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంటాడు. తాజాగా మరో కొత్త స్టైల్‌తో నెట్టింట్లో దర్శనమిచ్చాడు మహీ. దీనికి సంబంధించి వీడియోను ఐపీఎల్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
ఇందులో మహీ స్టైలిష్ గడ్డంతో.. హాయ్ చెప్తూ కనిపించాడు. నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు.