టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ ఎప్పటికప్పుడు కొత్తలుక్స్లో కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంటాడు. లాక్‌డౌన్‌తో ప్రస్తుతం ఇంటికే పరిమితమైన మహీ.. తాజాగా మరో లుక్‌లో కనిపించి అలరిస్తున్నాడు. అందుకు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇందులో షేప్ చేసిన నల్లటిరంగు గడ్డంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు ధోనీ. హెయిర్‌స్టైల్ కూడా ఇంతకు ముందు కంటే భిన్నంగా ఉంది.
కొత్త లుక్‌తో కేక పుట్టిస్తోన్న ధోనీ - ధోనీ వార్తలు
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ కొత్త లుక్‌లో అలరిస్తున్నాడు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ధోనీ
గతేడాది జరిగిన ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్ ధోనీ ఆడిన చివరి అంతర్జాతీయ మ్యాచ్. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్ 13వ సీజనలో పాల్గొని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ టోర్నీ నిరవధిక వాయిదా పడింది. అయితే దీనిని సెప్టెంబరు-నవంబరు మధ్య కాలంలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
ఇది చూడండి : 'ఇంగ్లాండ్‌కు ఆడితే చంపేస్తామన్నారు'
Last Updated : Jun 28, 2020, 1:23 PM IST