టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ లాక్డౌన్ సమయంలో కుటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. ఇటీవలే తన కొత్త రఫ్ లుక్‌లో దర్శనమిచ్చిన ఇతడు తాజాగా మరో వీడియోలో తమ పెంపుడు కుక్క సామ్‌తో ఆడుకుంటూ కనిపించాడు. ఈ వీడియోను మహీ భార్య సాక్షి ఇన్‌స్టా స్టోరీలో పంచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
పార్క్‌లో పెంపుడు కుక్కతో ధోనీ.. వీడియో వైరల్ - Dhoni, Jeeva Plays with Pet Dog
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ భార్య సాక్షి సింగ్ తాజాగా ఓ వీడియోను నెట్టింట పంచుకుంది. ఇందులో ధోనీ తన పెంపుడు కుక్క సామ్‌తో ఆడుకుంటూ కనిపించాడు.
ధోనీ
ఈ వీడియోలో ధోనీ తన ముద్దుల కుమార్తె జీవాతో, తన పెంపుడు కుక్కతో ఆహ్లాదంగా ఆటపాటలతో సమయం గడుపుతూ కనిపించాడు. సాధారణ టీషర్ట్, లూజ్ ప్యాంట్‌లో నెరిసిన సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్ గడ్డంతో కనిపించాడు. ధోనీని ఇలా చూసి క్వారంటైన్ లుక్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.